TPT: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 30న తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో కార్తీక మహాదీపోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.45 గంటల వరకు ప్రత్యేక పూజలు, శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టనున్నారు. భక్తిగీతాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు వందలాది మంది మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
30న తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవం


