హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేజర్లం.. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం

CTR: తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని CTRకు చెందిన హనీస, సయ్యద్ సైఫుద్దీన్ కోరారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న తామిద్దరం మేజర్లమని, స్వచ్ఛందంగా వివాహం చేసుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తల్లిదండ్రులు వేధిస్తూ, యువకుడి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సోమవారం వెల్లడించారు.