హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి: కలెక్టర్

MDK: ఎల్‌నినో ముప్పు, భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని కలెక్టర్ సూచించారు. కౌడిపల్లి మండలం రాజిపేట్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తక్కువ నీటితో పండే పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ, ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఏవో దేవకుమార్, ప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.