హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాచాపూర్‌లో 105 ఇందిరమ్మ బీమా దరఖాస్తుల సేకరణ

KNR: కాచాపూర్ గ్రామంలో సర్పంచ్ ఊకంటి మాధవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా 105 మంది లబ్ధిదారుల దరఖాస్తు పత్రాలను సేకరించారు. అర్హులైన కుటుంబాలు ఈ పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.