హైదరాబాద్: 28°C
వార్తలు

'వాట్సాప్' యూజర్స్‌కు బిగ్ అలర్ట్

ఆఫీసు లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వినియోగించడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైబర్ నిరోధక విభాగం హెచ్చరికలు జారీ చేసింది. లాగిన్ చేసి వదిలేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలను హ్యాక్ చేసి మోసాలు, స్కామ్‌లకు పాల్పడే ప్రమాదముందని తెలిపింది. వినియోగదారులు తమ భద్రత కోసం ప్రతి సెషన్ ముగిశాక తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలని సూచించింది.