హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి లేక భక్తుల అవస్థలు!

PPM: కొమరాడ మండలం దేవునిగుంప సమీపంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి రహదారి నిర్మాణం పూర్తి చేసి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని CPM మండల కన్వీనర్ సాంబమూర్తి కోరారు. సోమవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన, నిధులు మంజూరైనట్లు ప్రకటించినా పనులు పూర్తికాక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆలయానికి రహదారితో పాటు అవసరమైన వసతులు కల్పించాలని కోరారు.