హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ మేయర్ పదవీ దక్కలేదని ఎమ్మెల్యే అసంతృప్తి

AKP: జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 20 కార్పొరేటర్ స్థానాలు ఆశించగా కేవలం 11 సీట్లు మాత్రమే కేటాయించారని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ పదవి దక్కకపోగా, కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా దక్కుతుందని ఆశించినా నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమిలో ఉన్నప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవని, అయినప్పటికీ ఇది బాధాకరమైన విషయమని చెప్పారు.