హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

అల్లూరి జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ టి. నిశాంతి సోమవారం అధికారులతో సమీక్షించారు. వైద్యం, విద్య, వ్యవసాయం, పోషకాహారం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధుల రంగాల్లో లక్ష్యాలను గడువులోగా సాధించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలును పరిశీలించి, అభివృద్ధి సూచికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.