హైదరాబాద్: 28°C
వార్తలు

మే నెలలో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్‌ రన్‌: అశ్వినీ వైష్ణవ్‌

వచ్చే ఏడాది మేలో అహ్మదాబాద్‌-ముంబయి మార్గంలో 250 కి.మీ వేగంతో బుల్లెట్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఏప్రిల్‌ నాటికి కోచ్‌లు అందుబాటులోకి వస్తాయని, సూరత్-బిలిమొరా మధ్య 50 కి.మీ కారిడార్‌ పూర్తయిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసి 2029 నాటికి థానే వరకు విస్తరిస్తామన్నారు.