పశ్చిమ బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరును 'పశ్చిమ్‌బంగ'గా మార్చే ప్రతిపాదనకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 9న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఈ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే, తుది ఆమోదం కొరకు కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్తలు
BREAKING: బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం


