హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ఆలయ పూజా వేళల్లో మార్పు

NDL: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి, ప్రాతఃకాల పూజల అనంతరం 4:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం మహా మంగళహారతుల అనంతరం 5:30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.