NRML: కడెం మండలంలోని లక్ష్మీ సాగర్ పంచాయతీ కార్యదర్శి మోబిన్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. పోడు భూముల సర్వేలో భాగంగా ఒక్కొక్కరి వద్ద నుండి రూ.10 వేలు కార్యదర్శి తీసుకున్నాడని ఆరోపించారు. పని పూర్తి కాకపోవడంతో తమ డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణ
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వినతి


