హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్‌ను తప్పించడం కఠిన నిర్ణయం: గిల్

NZతో తొలి టెస్టులో సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడంపై కెప్టెన్ గిల్ స్పందించాడు. 'సిరాజ్ నాకు చాలా మంచి స్నేహితుడు. అతన్ని జట్టు నుండి తప్పించడం కఠినమైన నిర్ణయం. మ్యాచ్‌కు ముందే ఈ విషయాన్ని నేను అతనికి తెలియజేశాను. కొన్నిసార్లు మనం ఆటగాళ్ల ప్రదర్శన, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావచ్చు' అని గిల్ తెలిపాడు.