హైదరాబాద్: 28°C
క్రీడలు

అతడిని మెంటార్‌గా భావిస్తా: ధ్రువ్ జురెల్

ధ్రువ్ జురెల్ సహచర ఆటగాడు రిషభ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్‌ను తన మెంటార్‌గా భావిస్తానని, అతడి భయమెరగని మైండ్‌సెట్, ఆటతీరు నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో ధ్రువ్ (78) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాను ముందస్తు వ్యూహాల కంటే మ్యాచ్‌ పరిస్థితులకు తగినట్లుగా ఆడటానికే ప్రాధాన్యమిస్తానని అన్నాడు.