హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నెలాఖరులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి'

SRPT: కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు బండ్‌పై TUFIDC, అమృత్‌ 2.0 నిధులు రూ.11.14 కోట్లతో చేపడుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరిశీలించారు. అనంతరం R&B, మున్సిపల్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు..