హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల రోజు సెలవు

PLD: నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 26న (గురువారం) పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక సెలవు ప్రకటించారు. ఏపీ మున్సిపాలిటీల చట్టం 1988లోని సెక్షన్ 31(2) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.