SS: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను అనంతపురం నూతన జడ్పీ ఛైర్మన్ గంజే నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజును మంత్రి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ నేత ఆలం నరసానాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సవితను కలిసిన జడ్పీ ఛైర్మన్


