హైదరాబాద్: 28°C
క్రీడలు

బౌలర్లు అలసిపోయారు.. అందుకే డ్రాకు ఓకే: గిల్

న్యూజిలాండ్‌తో తొలి టెస్టును డ్రాగా ముగించడంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. పిచ్‌ నుంచి బౌలర్లకు సహకారం లేకపోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు అలసిపోవడంతో డ్రాకు అంగీకరించామని తెలిపాడు. మరో 5-10 ఓవర్లు బౌలింగ్ చేసినా ప్రయోజనం ఉండదని భావించామన్నాడు. మూడు రోజుల్లోనే రెండో టెస్టు ప్రారంభం కానుండటంతో బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నట్లు వెల్లడించాడు.