విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఏఓబీ సరిహద్దు కొండపై ఉన్న ఆజూరు గ్రామ పంచాయతీ సుమారు 30 ఏళ్లుగా ఏకగ్రీవంగానే ఎన్నికవుతోంది. 391 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో 1996 నుంచి చోడిపల్లి సురయ్య కుటుంబీకులే సర్పంచులయ్యారు. కొండదొర ఎస్టీ గిరిజనులు ఒకే నిర్ణయంతో ఓటు వేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈసారి పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా, ఏకగ్రీవానికి చర్చలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
30 ఏళ్లుగా ఆజూరు పంచాయతీ ఏకగ్రీవమే


