TG: AP చర్యల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏపీ నీటిని అక్రమంగా తీసుకుపోయినా.. ప్రాజెక్టు కడుతున్నా ప్రభుత్వానికి సోయి లేదన్నారు. హైదరాబాద్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ట్యాంకర్ల వినియోగం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. వెంటనే పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఏపీ చర్యల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం: సబిత


