హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీకి రుద్రాక్ష మాలను ఇచ్చిన నేపాల్ ప్రధాని

భారత్ పర్యటనకు వచ్చి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ప్రధాని మోదీకి పవిత్రమైన రుద్రాక్ష మాలను బహుమతిగా ఇచ్చారు. అలాగే శాలిగ్రామాన్ని, ఒక గంధాన్ని ప్రత్యేకమైన కళాత్మక చెక్క పెట్టెలో ఉంచి ఇచ్చారు. అలాగే ప్రతిగా మోదీ త్రివేణి సంగమం నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలాన్ని ప్రత్యేక కలశంలో నేపాల్ ప్రధానికి బహుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.