హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా హనీ స్పందన ప్రమాణ స్వీకారం

బాపట్ల: చీరాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా హనీ స్పందన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 77 ఏళ్ల చీరాల మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి టీడీపీ పీఠాన్ని కైవసం చేసుకోగా, 44 వార్డుల్లో కూటమి 25 వార్డులు గెలుచుకుంది. ఛైర్‌పర్సన్‌తో పాటు నూతన కౌన్సిలర్లు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య, యువ నాయకులు గౌరీ అమర్నాథ్, ఎంపీ కృష్ణ ప్రసాద్, మహేంద్ర నాథ్ పాల్గొన్నారు.