హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన

ASF: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాంగ్రెస్ జైనూర్ అధ్యక్షుడు షేక్ రషీద్, గౌరీ కొలాంగూడ సర్పంచ్ అయ్యుబాయి అన్నారు. సోమవారం గ్రామపంచాయతీలో పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.