హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను కలిసిన మంత్రి

NLR: చేజర్ల మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో కిమ్స్ ఛైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సోదరి లలితమ్మ, ఎంపీపీ నరసింహరావు సతీమణి జ్యోతిలు ఉన్నారు. గ్రామాల్లో సమస్యలు గుర్తించి పరిష్కారం చూపించాలని మంత్రి నూతన సర్పంచులకు సూచించారు.