హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారుమెట్ట సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా సొలగం కృష్ణారావు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వందనపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో గ్రామస్థులను కలిశారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.