AKP: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలోని శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో హోంమంత్రి అనిత పూజలు


