SKLM: పోలాకి మండలం డోలా గ్రామంలో సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ప్రశాంతి మందిరంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన పాల్గొని బాబాకు నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మిరియాపల్లి వెంకట అప్పలనాయుడు, పీఏసీఎస్ చైర్మన్ బైరి భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డోలాలో సత్యసాయి బాబా జయంతి వేడుకలు


