శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో 29వ వార్డులో మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి పర్యటించారు. కార్పొరేటర్ యు.ఉషశ్రీ ఆధ్వర్యంలో పెయ్యాల వాని పేట, అస్సేగు వాని పేట, దుప్పలవలసలో ప్రచారం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'


