హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రచనల నాణ్యతకు సమీక్షలు అవసరం: భక్తవత్సల

TPT: సాహిత్య రచనల నాణ్యత మెరుగుపడాలంటే విమర్శ అవసరమని, కథలు, కవితలకు ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించడం మంచిదని విశ్రాంత ఆచార్యులు భక్తవత్సల రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో వేమన విజ్ఞాన కేంద్రం, సృజన సాహిత్య సంగమం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నెలవారీ సాహితీ కార్యక్రమం జరిగింది.