హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ వాటర్ గ్రిడ్‌పై బీఆర్ఎస్ ఫోకస్!

NLG: నాగార్జునసాగర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పనులపై బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందన్న ఆందోళన నేపథ్యంలో, మరో రెండు మూడు రోజుల్లో పార్టీ నేతల బృందం సాగర్‌ను సందర్శించనుంది. ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం కేటీఆర్ నేతృత్వంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనుంది.