హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల–గుంతకల్లు రైల్వే మార్గంలో డీఆర్‌ఎం తనిఖీలు

ATP: నంద్యాల నుంచి గుంతకల్లు రైల్వే మార్గంలో గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) చంద్ర ఎస్. గుప్తా విండో ట్రైలింగ్ తనిఖీలు నిర్వహించారు. సంబంధిత శాఖాధికారులతో కలిసి ట్రాక్ సామర్థ్యం, భద్రతా మౌలిక సదుపాయాలు, సున్నిత ప్రాంతాల స్థితిగతులను పరిశీలించారు. నిర్వహణ ప్రమాణాలను మెరుగుపరిచే అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.