NLR: ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి శివారులో నిర్మించిన గోదాము నిరుపయోగంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 78 సహకార సంఘాల పరిధిలో 44 గోదాములను రూ.19.2 కోట్లతో నిర్మించారు. అయితే కనీస వసతులు లేకపోవడంతో రైతులకు అవి ఉపయోగపడటం లేదు. అధికారులు స్పందించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.19 కోట్లతో కట్టినా నిరూపయోగమే!


