హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు బంద్

ADB: జిల్లా గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి ప్రభుత్వ సెలవు సందర్భంగా మంగళవారం (నవంబర్ 24) ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు జరగవని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. రైతులు రేపు పత్తిని యార్డుకు తీసుకురావద్దని, బుధవారం (నవంబర్ 25) యథావిధిగా కొనుగోళ్లు ఉంటాయని పేర్కొన్నారు.