హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోదరుడి అప్పు.. యువతికి అసభ్య కాల్స్!

HYD: షేక్‌పేట్‌లోని యువతికి ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేసింది. ఆ ఫోన్ కాల్‌లో 'నీ వివరాలు మా దగ్గర ఉన్నాయ్ నీ ఫొటోలు మార్ఫ్ చేసి SMలో పెడతాం' అని బెదిరించారు. దీంతో ఆమె వెంటనే ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. తన సోదరుడు రూ.లక్ష అప్పు చేశాడని, వెంటనే తీర్చలేదంటే వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డు, పర్సనల్ డీటైయిల్స్‌తో ఫొటోలు మార్ఫింగ్ చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు చేసింది.