హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లి మృతి.. యోగి భావోద్వేగ నోట్

తన మాతృమూర్తి స్వర్గస్థురాలైన సందర్భంగా యూపీ సీఎం యోగి భావోద్వేగ నోట్ విడుదల చేశారు. తాను సన్యాసం స్వీకరించిన 3 ఏళ్లకు ఇంటికి భిక్షకు వెళ్లినట్లు చెప్పారు. భిక్షందేహి అన్న తన గొంతు విని బయటకు వచ్చిన తల్లి.. సన్యాసం దుస్తుల్లో తనను చూసి నమ్మలేకపోయిందని గుర్తు చేసుకున్నారు. 'నాయనా, ఇదేం వేషం? ఇంట్లో ఏం తక్కువైందని ఇలా భిక్ష అడుగుతున్నావు?' అని కన్నీటి పర్యంతమైందని తెలిపారు.