కరీంనగర్ జిల్లాలో మూడు మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినా, రైతులకు ఆశించిన సహాయం అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరవు మండలంగా ఎంపికైన కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, హుజూరాబాద్ మండలంలో పంట నష్టాల సర్వే, పరిహారం పంపిణీ, యాసంగి రుణాల మంజూరుపై స్పష్టత కరవైంది. జిల్లాలో మిగిలిన 13 మండలాలను సైతం కరవు మధ్యస్థ మండలాలుగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
కరవు ప్రకటనే తప్ప రైతులకు దక్కని భరోసా..!


