RR: ఆదిభట్ల, ఎంఎం కుంట, నాదర్‌గుల్ ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్క్ భూసేకరణ వివాదంపై CM రేవంత్ రెడ్డిని కలుస్తానని MLC కోదండరాం తెలిపారు. బషీర్‌బాగ్‌లో ఆదివారం జరిగిన బాధితుల సమావేశంలో మాట్లాడారు. 2004లో 5 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరిహారం చెల్లించని భూములను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు ఆరోపించారు. సుమారు 20 వేల మందికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హార్డ్‌వేర్ పార్క్ భూసేకరణ వివాదంపై CMని కలుస్తా: MLC కోదండరాం


