MNCL: హాజీపూర్ మండలంలోని కొండాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో రాజయ్య, ఎల్లమ్మకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు


