హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌ఎంలకు గుదిబండగా మారిన స్పర్శ్ విధానం

KMM: ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు చేస్తున్న నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ (స్పర్శ్‌) ఇప్పుడు ప్రధానోపాధ్యాయులకు గుదిబండగా మారింది. పనులు చేయకముందే బిల్లులు సమర్పించాలని పెట్టిన నిబంధనతో ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు బిల్లులు ఇవ్వాలంటే కమీషన్ చెల్లించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నట్లు హెచ్‌ఎంలు వాపోతున్నారు.