NRML: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో చిన్న షట్టర్ దుకాణంలో చేపల వ్యాపారం చేసే ఆరోల్ల ప్రశాంత్‌కు వింత అనుభవం ఎదురైంది. గతంలో ఆయన దుకాణానికి ప్రతినెలా రూ.150 నుంచి రూ.330 మధ్యలో మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేది. కానీ తాజాగా బిల్లు చెల్లించేందుకు ఫోన్ పే యాప్ తెరవగా, TGNPDCL తరఫున నవంబర్ 26 గడువు తేదీతో ఏకంగా రూ. 53,42,957 బిల్లు చూపించడంతో ఆయన అవాక్కయ్యారు.
తెలంగాణ
కరెంట్ బిల్లు చూసి కంగుతిన్న వ్యాపారి


