SRD: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించేందుకు కొండాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు MPDO సౌమ్య శ్రీ తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై నేరుగా హాజరై దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
నేడు ప్రజావాణి కార్యక్రమం


