హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్‌లో నేడు ప్రజావాణి కార్యక్రమం

GDWL: అలంపూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రకళ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదులపై వినతులు స్వీకరిస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరై అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.