SRPT: భవన నిర్మాణ కార్మికుల బీమా పథకం సొమ్మును దళారులు కాజేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడింది. సూర్యాపేట జిల్లాలోనే 30 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించారు. మీసేవ నిర్వాహకులు, కార్మిక శాఖ సిబ్బంది కుమ్మక్కై నకిలీ లేబర్ కార్డులు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. సహజ మరణానికి రూ.1.30 లక్షలు, ప్రమాద మరణానికి రూ.6.30 లక్షలు చెల్లిస్తారు. అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
బీమా పథకంలో భారీ అక్రమాలు


