హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవేపై కారు బోల్తా.. ఆరుగురూ క్షేమం

SRPT: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై అక్కలదేవిగూడెం సమీపంలో ఈరోజు కారు ప్రమాదానికి గురైంది. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని మిడియన్ ప్లాంటేషన్‌లో పల్టీలు కొట్టింది. కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా, ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.