హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడ ఆలయంలో వైకుంఠ చతుర్దశి వేడుకలు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం వైకుంఠ చతుర్దశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక శుద్ధ వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ అనంతపద్మనాభ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోపాలకృష్ణ స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.