JGL: కోరుట్ల పట్టణంలోని పలు లాడ్జిలలో సీఐ కొమ్ము తిరుపతి, ఎస్సై శ్యామ్రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జిల రిజిస్టర్లను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బస చేసే వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్వాహకులకు సీఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలుపాలన్నారు.
తెలంగాణ
లాడ్జిలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు


