హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళితుల అసైన్‌మెంట్ భూములకు న్యాయం చేయాలి'

HNK: ఐనవోలు మండలం పున్నెలులో ఏకశిలా పాఠశాల నిర్మాణంపై విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ గిరిజన నేత రాయపురం సాంబయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 147లో దళితుల అసైన్‌మెంట్ భూములను ఆక్రమించి పాఠశాల నిర్మించారని ఆరోపించారు. పాఠశాల వ్యర్థాలు, మురుగునీటిని దళితుడికి చెందిన మూడు ఎకరాల భూమిలోకి వదలడంతో రైతుకు నష్టంవాటిల్లుతోందన్నారు.