హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో నేటి నుంచి ఇంటింటికి పల్స్ పోలియో

HYD: నగరంలో నేటి నుంచి ఇంటింటికీ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో వైద్య సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇప్పటికే పోలియో బూత్‌‌లకు వెళ్లి చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి టీకా అందిస్తారు. హైదరాబాద్ జిల్లాలో సుమారు 9.26 లక్షల ఇళ్లను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.