హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలరించిన విద్యార్థుల నృత్యాలు

RR: షాద్‌నగర్‌లోని హెరిటేజ్ వ్యాలీ ది ఇండియన్ స్కూల్‌లో 'లెర్న్ టుడే, లీడ్ టుమారో' ఇతివృత్తంతో వార్షిక వేడుక జరిగింది. విద్యార్థుల మార్చ్‌పాస్ట్, నృత్య, గాన ప్రదర్శనలు, భారతదేశ రూపంలో ప్రత్యేక ఫార్మేషన్ ఆకట్టుకున్నాయి. బ్రిగేడియర్ ఎంకేఎస్ మౌళి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. వ్యవస్థాపకురాలు జ్యోతి గురువారా, ప్రిన్సిపల్ ప్రదీప్ మిస్త్రీ పాల్గొన్నారు.