హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖాళీగా కీలక పోస్టులు.. భర్తీ ఎప్పుడు?

WGL: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రెండు కీలక ACP పోస్టులు నెలలుగా ఖాళీగా ఉన్నాయి. WGL ACPగా పనిచేసిన IPS అధికారి నగ్రాలె శుభమ్ ప్రకాశ్ ఏప్రిల్‌లో నిజామాబాద్‌కు బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయ్యింది. జనగామ ACP నితిన్ చేతన్ 7 నెలల క్రితం జగిత్యాల అడిషనల్ SPగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెండు పోస్టులకు పూర్తిస్థాయి అధికారుల నియామకం జరగలేదు.